
నిబంధనలు పాటించాలి
లక్సెట్టిపేట: రాజీవ్ యువవికాసం లబ్ధిదా రు ల ఎంపికలో నిబంధనలు పాటించాలని జి ల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్ సూ చించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బ్యాంక్ అధికారులు దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ వివరాలు సేకరించాలని, నిబంధనలు పారదర్శకంగా ఉండాలని తెలిపారు. అర్హుల నే ఎంపిక చేయాలని సూచించారు. బీసీ వె ల్ఫేర్ అధికారి పురుషోత్తం నాయక్, మండల ప్రత్యేకాధికారి అవినాష్, మైనార్టీ అధికారి రా జశ్వేరి, ఎంపీడీవోలు సరోజ, ప్రసాద్, ఎంపీవో శ్రీనివాస్, బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు.