
గిరిజనుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
ఉట్నూర్‌రూరల్: గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా పేర్కొన్నారు. ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలపై అందించిన అర్జీలను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో మాట్లాడుతూ అర్జీలను శాఖల అధికారులు పరిశీలించి న్యాయం చేయాలన్నారు. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీవో మనోహర్, ఏవో దామోదర స్వామి, ఈఈ తానాజీ, పీహెచ్‌వో సందీప్, డీపీవో ప్రవీన్ , జేడీఎం నాగభూషణం పాల్గొన్నారు.
● ఉట్నూర్ మండలం కమాయిపేట గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని భీంరావు అర్జీ అందించాడు.
● బోథ్ మండలం సాంగ్వి గ్రామానికి చెందిన రాజేశ్వరి తనకు ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టా మంజూరు కల్పించాలని విన్నవించింది.
● కుమురం భీం జిల్లా జైనూరు మండలం పాట్నాపూర్‌కు చెందిన ఆత్రం లత తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని వేడుకుంది.
● 9 నెలలు గడిచినా వేతనాలు చెల్లించని సొల్యూషన్ విద్యాంజలి సంస్థ జిల్లా కోఆర్డినేటర్లపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో అర్జీ అందించారు.
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా