
మాలగురిజాలలో నిమ్స్ వైద్య బృందం పర్యటన
బెల్లంపల్లిరూరల్: మండలంలోని మాలగురిజాల గ్రామంలో శనివారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి వైద్యుల బృందం పర్యటించింది. తాళ్లగురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని పరిశీలించారు. నిమ్స్ వైద్యుల బృందం నెఫ్రాలజీ విభాగం అసిస్టెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ చరణ్‌రాజ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్‌చందర్, వైద్యులు నిరంజన్, గణేష్, శంకర్ జిల్లా వైద్య, ఆర్యోగ శాఖ అధికారి హరీష్‌రాజ్‌తో కలిసి ఇంటింటికీ వెళ్లి కిడ్నీ బాధితుల మెడికల్ రిపోర్టులు పరిశీలించారు. వైద్యులు మాట్లాడుతూ గ్రామంలో 153 మంది రక్త నమూనాలను టీ హబ్‌కు పంపించామని తెలిపారు. గ్రామస్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రిపోర్టులు వచ్చిన తర్వాత కిడ్నీ సమస్య తీవ్రంగా ఉన్న వారికి నిమ్స్‌లో చికిత్స అందిస్తామని అన్నారు. డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సుధాకర్‌నాయక్, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, పీహెచ్‌సీ వైద్యురాలు ఎవంజలీన్, తదితరులు పాల్గొన్నారు.