
కనీస పింఛన్ రూ.5 వేలు చెల్లించాలి
శ్రీరాంపూర్: బొగ్గు గని రిటైర్డ్ కార్మికులకు కనీస పింఛన్ రూ.5వేలు చెల్లించాలని బీఎంఎస్ బొగ్గు గనుల ఇన్‌చార్జి, సీఎంపీఎఫ్ ట్రస్టీ బోర్డు సభ్యుడు కొత్తకాపు లక్ష్మారెడ్డి ట్రస్టీ బోర్డును డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలో సీఎంపీఎఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ట్రస్టీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ట్రస్టీ చైర్మన్ విక్రమ్ దేవాదత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎఫ్‌పీఎస్ 1971 పింఛన్‌దారులకు ప్రస్తుతం ఉన్న పింఛన్ చాలా తక్కువగా ఉందన్నారు. ఎక్సెంజ్‌ట్రేడెడ్ ఫండ్‌లో పెట్టుబడుల శాతాన్ని 7 నుంచి 10వరకు పెంచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. సీఎంపీఎఫ్ ప్రధాన కార్యాలయంలో కూడా పెట్టుబడులను అజమాయిషీ చేసే యంత్రాంగం ఉండాలన్నారు. సీఎంపీఎఫ్ సేవలన్నీ ఆన్‌లైన్ చేయాలని తమ నాయకుడు లక్ష్మారెడ్డి కోరారని బీఎంఎస్ సింగరేణి విభాగం అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య తెలిపారు. పింఛన్ ఫండ్‌కు ప్రతీ టన్ను బొగ్గు అమ్మకంపై రూ.20 జమ చేయాలని సూచించగా బోర్డు సభ్యులతోపాటు సింగరేణి సీఎండీ కూడా అంగీకారం తెలిపారని అన్నారు.