
● క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్న అధికారులు ● భూ సమ
జిల్లాలో భూ స్వరూపం
మొత్తం విస్తీర్ణం 4016.46చ.కి.మీ.
అటవీ భూమి 1761.17చ.కి.మీ.
రెవెన్యూ గ్రామాలు 382
మొత్తం సాగు భూమి
3,30,891.403 ఎకరాలు.
సగటు భూ కమతం 2.29ఎకరాలు
ప్రస్తుతం భూభారతి
పెండింగ్ అర్జీలు 1620
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ రాకతో జిల్లాలో భూ సమస్యలు తీరుతాయనే ఆశలు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌వోఆర్ చట్టానికి సవరణ చేసి నూతనంగా 2024 చట్టం తీసుకొచ్చింది. ఈ క్రమంలో జిల్లాలో భూభారతి పోర్టల్‌పై క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. రెవెన్యూ సదస్సులు నిర్వహించాక పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. జిల్లాలో అనేక చోట్ల భూ సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అనేకమంది భూములు నిషేధిత జాబితా, ఆర్‌ఆర్వోఎఫ్‌ఆర్ సంబంధించి అవరోధాలు తలెత్తాయి. ఇప్పటికీ ప్రతీ సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగంలో భూ సమస్యలపైనే అనేక మంది అర్జీలు ఇస్తున్నారు. భూ తగదాలు, కోర్టు కేసులతోపాటు వారసత్వ బదిలీలు సైతం ఇబ్బందిగా మారాయి. జిల్లాలో భూ యజమానుల మధ్య సరిహద్దు సమస్యగా 20వేల ఎకరాలు ఉన్నాయి. అంతేకాక భూ ప్రక్షాళన సందర్భంగా పలు బోగస్ పట్టాలు సైతం ఉన్నట్లు వెల్లడయ్యాయి. కొందరు ఎలాంటి మోకపై లేకున్నా పట్టాలు పొందిన ఘటనలు ఉన్నాయి. ఇక సీలింగ్, అసైన్డ్‌దారులు పట్టాలో ఒకరి పేరు కాస్తులో మరొకరి పేరుతో ఉన్నారు. ఏళ్లుగా అనుభవదారులుగా ఉంటున్నా హక్కులు రావడం లేదు.
పరిష్కారం కోసం..
జిల్లాలో ఇప్పటికీ అనేక మంది తమ భూమి హక్కు ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. భూ ప్రక్షాళన సందర్భంగా దొర్లిన తప్పులతో తర్వాత సరిదిద్దే అ వకాశం లేకుండా పోయింది. అనేక సార్లు రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకున్నా ఆ మేరకు పరి ష్కారం కావడం లేదు. ఇప్పటికీ జిల్లాలో సాదాబైనామాల అర్జీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. తెల్లకాగితాలపై జరిగిన లావాదేవీలకు మోక్షం కలుగడం లే దు. అసైన్డ్, అటవీ, సింగరేణి భూముల మధ్య వివాదాలు ఉన్నాయి. పార్ట్–బీగా పేర్కొన్న నిషేధిత జాబితాలో పెండింగ్‌లోనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో సర్వే జరగకపోవడంతో వివాదాలు కొనసాగుతున్నాయి.
కొత్త చట్టంపైనే ఆశలు
కొత్త చట్టంతో భూ చిక్కులు తీరుతాయనే ఆశలు నె లకొన్నాయి. భూభారతిలో ఇక నుంచి ప్రతీ కమతా నికి భూధార్ పేరుతో ప్రత్యేక గుర్తింపు సంఖ్య, నంబర్లు ఇస్తున్నారు. అంతేకాక రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు సులభంగా చేసేలా కొత్త చట్టాన్ని రూపొందించారు. డేటా ఎంట్రీ, స్టాంపు రిజిస్ట్రేషన ఫీ చెల్లింపు, ఈ చలాన్, స్లాట్ బుకింగ్, వంటి సేవలు మెరుగుపర్చారు. ఇక కొత్త పోర్టల్‌లో భూమిత్రతో ఏఐ(కృత్రిమ మేధ)తో అన్నివిధాల సహాయ సహకారాలు అందేలా ఏర్పాట్లు చేయనుంది. తహసీల్దార్లు, ఆ ర్డీవోలకు సైతం మ్యుటేషన్ అధికారం కల్పించడం వంటివి కొత్త చట్టంలో ఉన్నాయి. తహసీల్దార్, ఆర్డీ వోల స్థాయిల్లోనే సాదాబైనామాలు, రిజిస్ట్రేషన్, త ర్వాత మ్యుటేషన్లు జరగనున్నాయి. ఆన్‌లైన్‌లో న మోదు, వారసత్వ భూముల మార్పిడి సరళతరం చేశారు. వేగంగా సులభంగా భూ హక్కులు పొంది తే భూ యజమానులకు తిప్పలు తప్పే అవకాశం ఉంది.