
టిప్పర్, బైక్ ఢీకొని ఇద్దరికి గాయాలు
దస్తురాబాద్: బుట్టాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని చెన్నూర్ గ్రామ సమీపంలో మంగళవారం టిప్పర్, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఎస్సై సీ.అశోక్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని చెన్నూర్‌కు చెందిన శంకర్‌గౌడ్, కలమడుగుకు చెందిన రాకేశ్ ద్విచక్ర వాహనంపై కలమడుగు నుంచి చెన్నూర్‌కు వస్తుండగా పాండ్వాపూర్–కలమడుగు రహదారిపై టిప్పర్ ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను జగిత్యాలలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శంకర్ గౌడ్ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.