బాసర: బాసర ట్రిపుల్ ఐటీలో త్రినయన సాంస్కృతిక ఉత్సవం నిర్వహించారు. దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే అనేక ప్రదర్శనలు విద్యార్థులు ప్రదర్శించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో జానపదాల పాటలు, నృత్యప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచయి. కళలు, సంగీతం, నృత్యం మాత్రమే కాకుండా, ఫ్యాషన్ ప్రదర్శన ‘ఫ్యాషన్ ఫ్రెంజీ‘ ద్వారా విద్యార్థులు తమ సృజనాత్మకతతో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ ‘త్రినయన’ పేరిట జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థులు తమలోని కళా నైపుణ్యం ప్రదర్శించారన్నారు. ఈ ఉత్సవం విద్యార్థుల్లో సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించడమే కాకుండా, సృజనాత్మకతను ప్రోత్సహించే వేదికగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధరన్, ఏఓ రణధీర్‌సాగి విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. కన్వీనర్లు డాక్టర్ రాములు, డాక్టర్ అజ య్, ప్రభాకర్‌రావు అసోసియేటెడ్, డాక్టర్ విఠల్, డాక్టర్ మహేశ్, అధ్యాపకులు పాల్గొన్నారు