కై లాస్‌నగర్: పట్టణ తైబజార్ వేలం ద్వారా మున్సిపాలిటీకి భారీగా ఆదాయం సమకూరింది. పట్టణానికి చెందిన మీర్జా అమ్రీన్‌బేగ్, సయ్యద్ ఇస్రార్, కాళ్ల సాయికృష్ణలు దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్‌లో కమిషనర్ సీవీఎన్.రాజు అధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు. ఇస్రార్ గైర్హాజరు కాగా మిగతా ఇద్దరు హాజరయ్యారు. ఇందులో అధికంగా రూ.26.25 లక్షలకు మీర్జా అమ్రీన్‌బేగ్ తైబజార్‌ను దక్కించుకున్నారు. గతేడాది రూ.20.69 లక్షలకు వేలం వేయగా, ఈసారి బల్దియాకు రూ.5.56లక్షల ఆదాయం అదనంగా సమకూరింది. సదరు వ్యక్తికి ఏడాదిపాటు తైబజార్ నిర్వహించుకునే అవకాశముంటుంది. బల్దియా ఉద్యోగులు, దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు.