బెల్లంపల్లి: బెల్లంపల్లి కేంద్రంగా గంజాయి అమ్ముతున్న నలుగురు యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. సోమవారం వన్‌టౌన్ ఎస్‌హెఎచ్‌వో ఎన్.దేవయ్య తెలిపిన వివరాల ప్రకారం... కన్నాల బస్తీ వద్ద కొందరు యువకులు గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో వన్‌టౌన్ ఎస్‌హెచ్‌ఓ దేవయ్య, పోలీసు సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల్లో ఎండీ.తాజ్‌బాబా(హన్మాన్ బస్తీ–బెల్లంపల్లి), షేక్ ఇర్ఫాన్ బాబా (షంషీర్ నగర్–బెల్లంపల్లి ), వాసాల గిల్‌క్రిస్ట్(రాజీవ్‌నగర్–తాండూర్), మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతం నుంచి వలస వచ్చిన సంతోష్ సామ్రాడ్ జాదవ్(కాల్‌టెక్స్ ఏరియా) ఉన్నారు. వీరి నుంచి 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా గంజాయి, తాగుడుకు బానిసగా మారి మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకు వచ్చి విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు.