
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
● కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్: జిల్లాలోని భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ మంచిర్యాల ఆర్‌డీఓతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతీ దరఖాస్తును పరిశీలించి అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని అన్నారు.
– మందమర్రి శివారులోని తన భూమిని కొందరు అక్రమంగా పట్టా చేయించుకున్నారని, ఈ విషయమై కోర్టులో కేసు కొనసాగుతున్నందున ఎలాంటి లావాదేవీలు జరగకుండా బ్లాక్ చేయాలని మందమర్రి మండలం విలేజ్ రామకృష్ణాపూర్‌కు చెందిన మెంగని శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు.
● ఇందిరమ్మ ఇళ్లు ప్రతీ దివ్యాంగుడికి కేటాయించాలని, 40శాతం వైకల్యం కలిగిన వారికి అంత్యోదయ రేషన్ కార్డులు అందించాలని, రాజీవ్ యువ వికాసం పథకంలో అవకాశం కల్పించాలని, సదరం శిబిరాల్లో స్లాట్లను 100కు పెంచాలని తెలంగాణ దివ్యాంగుల ఐక్యవేదిక ప్రతినిధి నగురారపు సుమన్ కోరారు.