● డయాలసిస్‌ రోగులను పట్టించుకోని ప్రభుత్వం ● భారంగా బతుకీడుస్తున్న రోగులు ● ఆదుకోవాలని వేడుకోలు | - | Sakshi
Sakshi News home page

● డయాలసిస్‌ రోగులను పట్టించుకోని ప్రభుత్వం ● భారంగా బతుకీడుస్తున్న రోగులు ● ఆదుకోవాలని వేడుకోలు

Mar 24 2025 6:15 AM | Updated on Mar 24 2025 6:14 AM

ఈ ఫొటోలోని వ్యక్తిపేరు అట్టెల మల్ల య్య. కోటపల్లి మండలం రాపన్‌పల్లికి చెందిన ఇతనికి ఎని మిదేళ్ల క్రితం కిడ్నీ చెడిపోయిందని డాక్టర్లు చెప్పారు. ఆరేళ్లు మందులు వాడాడు. రూ.8 లక్షల వరకు చికిత్సకు ఖర్చు చేశాడు. అయినా మెరుగు పడకపోవడంతో రెండేళ్ల నుంచి డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు. నెలకు 15 రోజులు డయాలసిస్‌ చేయించుకోవాలి. డయాలసిస్‌కు ఒంటరిగా వెళ్లలేడు. మరో సహాయకుడిని తీసుకుని వెళ్లాలి. ఇందుకు కేవలం రవాణా చార్జీలకే రూ.4,500 ఖర్చవుతుంది. ప్రభుత్వం పింఛన్‌ ఇవ్వకపోవడంతో సొంతంగానే ఖర్చు పెట్టుకుంటున్నాడు. మందులకు అదనంగా ఖర్చవుతుందని తెలిపాడు.

చెన్నూర్‌ సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్‌ చేయించుకుంటున్న కిడ్నీ బాధితులు

చెన్నూర్‌: జిల్లాలో డయాలసిస్‌ రోగుల ఆర్థిక కష్టాలు ఎవరికీ పట్టడం లేదు. రెక్కల కష్టాన్ని నమ్ముకు ని జీవనం సాగిస్తున్న నిరుపేదలు కిడ్నీలు దెబ్బతినడంతో డయాలసిస్‌ కోసం రెండు రోజులకు ఒకసారి ఆస్పత్రికి వెళ్తున్నారు. ఒక కిడ్నీ చెడిపోయినవారు మరో కిడ్నీ బాగుండేందుకు డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. లేదంటే మరో కిడ్నీ కూడా చేడిపోయే ప్రమాదం ఉంది. దీంతో రవాణా ఖర్చులు భారమైనా తప్పనిసరి పరిస్థితిలో ఆస్పత్రులకు వెళ్తున్నారు. ప్రభుత్వం కిడ్నీ బాధితులకు పింఛన్లు ఇస్తుంది. అయితే కొత్తగా వ్యాధిగ్రస్తులను ఎంపిక చేయడంలేదు. దీంతో పేద రోగులు పింఛన్లు రాక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.

ఇదీ పరిస్థితి...

జిల్లాలో 145 మంది డయాలసిస్‌ పేషంట్లు ఉన్నా రు. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో 66 మంది, బెల్లంపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో 34 మంది, చెన్నూర్‌ సామాజిక ఆరోగ్య కేంద్రంలో 45 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. రోజు విడిచి రోజు ఉదయం ఆస్పత్రికి వస్తే సాయంత్రం వరకు ఉండాల్సిన పరిస్థితి. వీరే కాకుండా వీరితో వచ్చే సహాయకులు కూడా నిరీక్షించాల్సిందే. ప్రభుత్వం గతంలో డయాలసిస్‌ పేషంట్లకు నెలకు రూ.2 వేల పెన్షన్‌ ఇచ్చేది. కొత్తగా డ యాలసిస్‌ చేయించుకుంటున్న కిడ్నీ బాధితుల కు పింఛన్లు రావడం లేదు. దీంతో కిడ్నీ రోగులు ఇ బ్బంది పడుతున్నారు. తమ ప్రాణాలు అంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పెన్ష న్లు మంజూరు చేసి అదుకోవాలని కోరుతున్నారు.

జిల్లాలో డయాలసిస్‌ రోగుల వివరాలు

సెంటర్‌ పేరు పెన్షన్‌ వస్తున్నవారు పెన్షన్‌ రానివారు మొత్తం

మంచిర్యాల 32 34 66

చెన్నూర్‌ 15 30 45

బెల్లంపల్లి 14 20 34

కట్టెపట్టుకుని నడుస్తున్నా..

నాది కోటపల్లి మండలం నక్కలపల్లి. ఆ రేళ్ల నుంచి డయాలసిస్‌ చేయించుకుంటున్న. నడుము లేదు కట్టే పట్టుకుని నడుస్తున్నా.. ఆటోలో డయాలసిస్‌కు పోతున్న. నెలకు రూ.5 వేలు ఆటో చార్జీలకే అవుతున్నయ్‌. మావోళ్లు నానా కష్టపడి చార్జీ లకు డబ్బులు ఇస్తుండ్రు. ప్రభుత్వం పింఛన్‌ మంజూరు చేయాలి.

– ఆరె బానయ్య నక్కలపల్లి

కండ్లు కనిపిస్తలెవ్వు..

నాది భీమారం మండలం కొత్తపల్లి. కిడ్నీలు దెబ్బతిన్నాయి. డయాలసిస్‌ చేయించుకుని బతుకుతున్నా. రోజు రోజుకు అవయవాలన్నీ చెడిపోతున్నాయి. కళ్లు కనిపిస్తలెవ్వు. కిడ్నీ బాధితులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి నెలకు రూ.5 వేల పెన్షన్‌ ఇవ్వాలి. బస్సులలో ఉచిత పాస్‌లు అందజేయాలి.

– సంజీవరెడ్డి, కొత్తపల్లి

● డయాలసిస్‌ రోగులను పట్టించుకోని ప్రభుత్వం ● భారంగా బతు1
1/3

● డయాలసిస్‌ రోగులను పట్టించుకోని ప్రభుత్వం ● భారంగా బతు

● డయాలసిస్‌ రోగులను పట్టించుకోని ప్రభుత్వం ● భారంగా బతు2
2/3

● డయాలసిస్‌ రోగులను పట్టించుకోని ప్రభుత్వం ● భారంగా బతు

● డయాలసిస్‌ రోగులను పట్టించుకోని ప్రభుత్వం ● భారంగా బతు3
3/3

● డయాలసిస్‌ రోగులను పట్టించుకోని ప్రభుత్వం ● భారంగా బతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement