మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకే ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టును సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్) వెంకటేశ్వర్లు ఆదివా రం సందర్శించారు. పని స్థలాలను ఏరియా జీఎం దేవేందర్‌తో కలిసి పరిశీలించారు. ప్రా జెక్టు అధికారులకు సూచనలు చేశారు. వారం రోజుల్లో ఆర్థిక లక్ష్యం పూర్తవుతుందని, సంస్థ నిర్దేశిత లక్ష్య సాధన కోసం అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం రఘుకుమార్, ఎస్‌వో టూ జీఎం విజయ్‌ప్రాద్, కేకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, కేకే గ్రూపు ఏజెంట్ రాంబాబు, ఏరియా ఇంజినీర్ వెంకటరమణ, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్ ఉన్నారు.