● అప్‌గ్రేడ్‌ అయినా మారని వసూళ్ల తీరు.. ● మొండిబకాయిదారులపై దృష్టిసారిస్తే మేలు ● వారం రోజులే గడువు.. 47.12 శాతమే వసూలు | - | Sakshi
Sakshi News home page

● అప్‌గ్రేడ్‌ అయినా మారని వసూళ్ల తీరు.. ● మొండిబకాయిదారులపై దృష్టిసారిస్తే మేలు ● వారం రోజులే గడువు.. 47.12 శాతమే వసూలు

Mar 24 2025 6:13 AM | Updated on Mar 24 2025 6:14 AM

మూకుమ్మడిగా సత్ఫలితాలు..

మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది వేర్వేరుగా కాకుండా, మూకుమ్మడిగా పన్ను వసూలుకు వెళ్లడంతో, కొంతమేర సత్ఫలితాలు ఇస్తోంది. 80 శాతంకు పైగా పన్ను వసూలు చేస్తే ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే అవకాశం ఉన్నందున, ఈనెల 31వ తేదీలోపు 70 శాతం దాటి పన్ను వసూలు చేయాలని అధికారులు, సిబ్బంది కార్యాలయాన్ని వదిలేసి, పన్ను వసూళ్లకు వెళుతున్నారు. ఏళ్ల తరబడి బకాయిలు ఉన్నవారు, పెద్ద మొత్తంలో బకాయి పడ్డవారికి రెడ్‌ నోటీసులను ఇచ్చి, వారిపై మున్సిపల్‌ చట్టప్రకారంగా చర్యలను తీసుకుంటేనే ఈ నెలాఖరులోపు అనుకున్న లక్ష్యం మేరకు పన్ను వసూలయ్యే అవకాశం ఉంది. ఏళ్ల తరబడి పన్ను చెల్లించనివారిపై చర్యలు తీసుకోక పోవడం, ఏటా చెల్లిస్తున్న వారే తిరిగి చెల్లించడం వలన వంద శాతం లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. నగరపాలక సంస్థగా మారిన తర్వాత మంచిర్యాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి నిధులు అవసరం అవుతాయి. 70 శాతంకు పైగా పన్ను వసూలు చేస్తేనే కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా అధికారులు మరిన్ని చర్యలను తీసుకోవాలి.

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల మున్సిపాలిటీని న గరపాలక సంస్థగా అప్‌గ్రేడ్‌ చేసినా.. పన్నుల వసూలు పరిస్థితి మాత్రం మారలేదు. ఆస్తి పన్ను వసూలుకు బల్దియా ఉద్యోగులు, సిబ్బంది ఆపసోపాలు పడుతున్నారు. మంచిర్యాల మున్సిపాలిటీని ప్రభుత్వం ఇటీవల నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్‌ చేసింది. మంచిర్యాల, నస్పూర్‌ మున్సిపాలిటీతోపాటు హాజీపూర్‌ మండలంలోని 8 గ్రామాలను నగరపాలక సంస్థలో విలీనం చేసింది. విస్తీర్ణం పెరగడం, ప న్ను బకాయిలు సైతం ఎక్కువగా ఉండడంతో, సంస్థ ఉద్యోగులు, సిబ్బంది సెలవు రోజుల్లోనూ పన్ను ల వసూలుకు పాట్లు పడుతున్నారు. ఒక్కొక్కరుగా వెళితే, పన్ను బకాయిదారులు చెల్లించడం లేదని, ఒకేసారి 30 మందితో వెళ్లి మరీ వసూలు చేస్తున్నారు. గత ఆదివారం(మార్చి 16న) 30 మంది మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది కలిసి శ్రీశ్రీనగర్‌లో మొండి బకాయిదారుల ఇళ్లకు వెళ్లి రూ.52 వేల పన్ను వసూలు చేశారు. ఇంటి ఆవరణలోనే కూ ర్చుని పన్ను చెల్లించి, నగర అభివృద్ధికి సహకరించాలని యజమానులను కోరుతూ, పన్ను వసూలు చేశారు. కొన్నేళ్లుగా పన్ను చెల్లింపుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న వారి జాబితాతోనే పన్ను వసూళ్లకు వెళ్తున్నారు. మార్చి 16న ఒక్కరోజే మొండి బకాయిలు రూ.3 లక్షలకు పైగా పన్ను వసూలు చేశారు. ఈ నెలాఖరు వరకు 70 శాతం టార్గెట్‌ పెట్టుకున్నారు.

లక్ష్యం చేరడం కష్టమే..

మంచిర్యాల మున్సిపాలిటీగా ఉన్నప్పుడు 27 వేల ఇళ్లు, రూ.18 కోట్ల పన్ను డిమాండ్‌ ఉండేది. నస్పూరు మున్సిపాలిటీలో 16 వేల ఇళ్లు, రూ.4.27 కోట్ల పన్ను డిమాండ్‌ ఉండగా, కార్పొరేషన్‌గా ఏర్పడిన తరువాత ఈ రెండు మున్సిపాలిటీలతోపాటు, హాజీపూర్‌ మండలంలోని 8 గ్రామాలను విలీనం చేశారు. దీంతో కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం ఇళ్ల సంఖ్య 45,327కు చేరగా, పన్ను డిమాండ్‌ రూ.26.04 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు రూ. 12.66 కోట్లు(47.12 శాతం) మాత్రమే వసూలు చేశారు. వారం రోజుల్లో రూ. 14.21 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఏళ్ల తరబడి, పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్న వారికి రెడ్‌ నోటీసులను ఇచ్చి, చెల్లించని వారి ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయినా బకాయిదారుల నుంచి స్పందన రావడం లేదు.

● అప్‌గ్రేడ్‌ అయినా మారని వసూళ్ల తీరు.. ● మొండిబకాయిదార1
1/2

● అప్‌గ్రేడ్‌ అయినా మారని వసూళ్ల తీరు.. ● మొండిబకాయిదార

● అప్‌గ్రేడ్‌ అయినా మారని వసూళ్ల తీరు.. ● మొండిబకాయిదార2
2/2

● అప్‌గ్రేడ్‌ అయినా మారని వసూళ్ల తీరు.. ● మొండిబకాయిదార

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement