మంచిర్యాలఅర్బన్: అధ్యాపకుల చేతుల్లోనే విద్యార్థుల భ విష్యత్ ఉందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. శనివారం మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘తెలంగాణ క్షేత్రాలు–అక్షర దర్శనం’ ముగింపు సదస్సుకు హాజరయ్యారు. ఇదే కళాశాలలో చదివిన రోజులు, అధ్యాపకులతో ఉన్న సంబంధాలు, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సదస్సుకు సంబంధించి అంతర్జాలంలో 35 మంది, నేరుగా 25 మంది వివిధ క్షేత్రాలపైన పత్రాలను సమర్పించారు. రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీల్లో రెండో బహుమతి సాధించిన ఐదుగురు విద్యార్థులకు ఎమ్మెల్యే ప్రశంసపత్రాలు అందజేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చక్రపాణి, ప్రిన్సిపాల్ పట్వర్థన్, సురేష్, సదస్సు సంచాలకుడు హరీష్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.