ఇంటర్‌ మూల్యాంకనం షురూ | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ మూల్యాంకనం షురూ

Mar 23 2025 9:16 AM | Updated on Mar 23 2025 9:11 AM

మంచిర్యాలఅర్బన్‌: ఇంటర్మీడియెట్‌ జవాబు పత్రా ల మూల్యాంకనం మంచిర్యాల ప్రభుత్వ జూనియ ర్‌ కళాశాలలో శనివారం మొదలైంది. ఏప్రిల్‌ 5వరకు కొనసాగనుంది. డీఐఈవో అంజయ్య పర్యవేక్షణలో మూల్యాంకనం కోసం సమన్వయ సమావే శం అసిస్టెంట్‌ ఆఫీసర్‌, చీఫ్‌ ఎగ్జామినర్‌, అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌, సబ్జెక్టు విషయ నిపుణులతో నిర్వహించారు. మూల్యాంకనంపై అవగాహన కల్పించా రు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మూల్యాంకనం చేయనుండగా.. ఆదివా రం నుంచి పూర్తి స్థాయిలో సాగనుంది. ఇతర జిల్లాల నుంచి 2,04,251 జవాబు పత్రాలు జిల్లా కేంద్రంలోని మూల్యాంకన కేంద్రానికి చేరాయి. పటిష్ట భ ద్రత మధ్య సబ్జెక్టులకు సంబంధించిన కోడింగ్‌ ప్ర క్రియ పూర్తి చేశారు. ఆయా సబ్జెక్టులు 1, 2తోపాటు గణితం 1ఏ, 1బీ, 2ఏ, 2బీ పేపర్లు వ చ్చాయి. ఇందులో సంస్కృతం 544, తెలుగు 3973, హిందీ 3102, ఇంగ్లిష్‌ 43942, గణితం 42,909, సివిక్స్‌ 9443, ఫిజిక్స్‌ 26151, ఎకానమిక్స్‌ 11095, కెమిస్ట్రీ 24,941, కామర్స్‌ 10158, బోటనీ 11602, జువాలజీ 10724, హిస్టరీ 915 పే పర్లు ఉన్నాయి. డీఐఈవో అంజయ్య మూల్యాంకన కేంద్రం కన్వీనర్‌గా, మరో ఏడుగురు సబ్జెక్టుల అధ్యాపకులు సహాయ క్యాంపు అధికారులు(ఏసీవో)గా వ్యవహరిస్తారు. ఎగ్జామినర్‌(ఏఈ)లు 224, చీఫ్‌ ఎగ్జామినర్‌లు 44మంది, సబ్జెక్టు విషయ నిపుణులు(ఎస్‌ఈ) ఏడుగురికి బాధ్యతలు అప్పగించారు. పొరపాట్లకు తావులేకుండా మూల్యాంకనం చేయాలని డీఐఈవో అంజయ్య తెలిపారు.

ఏప్రిల్‌ ఏడు నుంచి ‘పది’..

పదో తరగతి పరీక్షలు ఈ నెల 21నుంచి ప్రారంభం కాగా జవాబు పత్రాల మూల్యాంకనానికి చర్యలు వేగవంతం చేశారు. జిల్లా కేంద్రంలోని కార్మెల్‌ హైస్కూల్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏప్రిల్‌ ఏడు నుంచి 15వరకు మూల్యాంకనం చేస్తారు. ఆదివా రం నుంచి ఆయా పరీక్షల జవాబు పత్రాలకు జిల్లా కు చేరనున్నాయి. తొమ్మిది రోజులు మూల్యాంకనం సాగుతుందని డీఈవో యాదయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement