లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టును జిల్లా న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు శనివారం పరిశీలించారు. రికార్డు గదులు పరిశీలించి కేసుల వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని జూనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అసదుల్లా షరీఫ్‌కు సూచించారు. కోర్టు గదులను శుభ్రంగా ఉంచాలని, రికార్డులను భద్రంగా కాపాడాలని, కోర్టు పరిసరాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం సబ్‌జైల్‌ను పరిశీలించారు. అండర్ ట్రయల్ ఖైదీలు మంచి ప్రవర్తన కలిగి ఉండాలని తెలిపారు. క్రీడా వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్‌కుమార్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, జైలర్ తేజవాత్ స్వామి, కోర్టు సూపరింటెండెంట్ పాల్గొన్నారు.