మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ క్షేత్రాలు–అక్షర దర్శనం అనే అంశంపై జాతీయ సదస్సు ప్రారంభమైంది. రెండ్రోజులపాటు సదస్సు నిర్వహిస్తారు. 35 మంది పరిశోధకులు పత్రాలను సమర్పించా రు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల క్షేత్రాలపై పత్రాలను సమర్పించారు. రెండో రోజు శనివారం నాలుగు సెషన్లు కొనసాగనున్నాయి. కళాశాల ప్రిన్సిపాల్ చక్రపాణి, ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రామకృష్ణ, ఆచార్య సంగనభట్ల నర్సయ్య, గండ్ర లక్ష్మణ్‌రావు, మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నరేందర్‌రెడ్డి, సదస్సు సంచాలకుడు శ్రీధర్ హరీష్‌కుమార్ పాల్గొన్నారు.