బాసర: నిర్మల్ జిల్లా బాసరలో బ్రహ్మశ్రీ శ్రౌతి రాజేశ్వరి శర్మ –సునీత దంపతులు మహారుద్ర సహిత అష్టోత్తర శత సువాసిని సమారాధన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీ జ్ఞానసరస్వతి, మహాంకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు అభిషేకం, అర్చ న పూజలు నిర్వహించారు. అనంతరం గురుప్రార్థన ఉత్సవ సంకల్పం, 108 మంది బ్రాహ్మణోత్తములతో 1331 రుద్ర పారాయణం, 1000 శ్రీ సూక్తాపారాధనలు జరిపించారు. నా ట్యమండలి పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో చిన్నారులతో భరతనాట్య ప్రదర్శన నిర్వహించగా, తొగుట పీఠాధిపతి శ్రీమాధవానంద సరస్వతి స్వామి హాజరయ్యారు. వీరికి ఆలయ అర్చకులు, వేద పండితులు ఘనంగా స్వాగతం పలికారు. వివి ధ ప్రాంతాల నుంచి వచ్చిన బ్రాహ్మణోత్తములతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేడు 108 సువాసినీ సమారాధన కార్యక్రమం, స్వామి వారి పాదపూజ మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రౌతి రాజేశ్వర శర్మ తెలిపారు.