తాంసి(బోథ్): మండలంలోని కప్పర్లలో ఈ నెల 18న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్య క్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన జీపీ కార్మికుడు సలగంటి రాజలింగు (53) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 18న ఇంటివద్ద మద్యం మత్తులో పురుగుల మందు తాగా డు. గమనించిన కుటుంబ సభ్యులు రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు. మృతదేహన్ని ఎస్సై రాధిక పరిశీలించారు. మృతుని భార్య దేవత ఫి ర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.