బెల్లంపల్లి: భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యే క చర్యలు తీసుకుంటున్నామని బెల్లంపల్లి ఆర్డీ వో పి.హరికృష్ణ అన్నారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఏసీపీ రవికుమార్, భూ సమస్యల పరిష్కార వేదిక మండల స్థా యి కమిటీ అధికారులతో బెల్లంపల్లి సబ్ డివి జన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా భూ దరఖాస్తులు, వాటి పురోగతి, ఇప్పటివరకు పరిష్కరించిన వాటి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 34 దరఖాస్తులు రాగా, 14 మండల స్థాయిలో పరిష్కరించామని, సబ్ డివిజన్ స్థాయి కమిటీకి 4 సిఫారసు చేయగా, మరో 16 నిర్ణీత 21రోజుల గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మండలాల వారీగా ప్రభుత్వ శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేశారని వివరించారు. రైతులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ కే.శ్రీని వాసరావు, ఏడు మండలాల తహసీల్దార్లు, ఎస్సైలు, ఎంపీవోలు పాల్గొన్నారు.