మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిసాయి. ఈ నెల 5న పరీక్షలు ప్రారంభం కాగా.. ఈసారి ఒక్క విద్యార్థి కూడా డిబార్ కాకుండా పరీక్షలు సాఫీగా సాగాయి. చివరి రోజు ద్వితీయ సంవత్సరం పరీక్షకు 5,823 జనరల్ విద్యార్థులకు గాను 5,656 మంది(97శాతం) హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చోట్ల విద్యుత్, నీటి సౌకర్యం, టేబుళ్లు, రవాణా సౌకర్యం కల్పించారు. క్షణం తీరిక లేకుండా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు పరీక్షలు ముగియడంతో ఆనందంలో మునిగితేలారు. చిరుదరహాసాలతో వెళ్తూ సెల్ఫీలు తీసుకోవడం, టాటాలు చెప్పుకోవడం కనిపించింది. హాస్టళ్లలో చదువే లోకంగా ఉన్న విద్యార్థులు పరీక్షలు పూర్తి కావడంతో పెట్టె సర్దుకుని ఇంటిబాట పట్టారు.
22న స్పాట్ వాల్యూయేషన్
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన తెలుగు, హిందీ, ఇంగ్లిష్, పౌరశాస్త్రం, మ్యాథ్స్ జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల22న మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతుందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి అంజయ్య తెలిపారు. స్పాట్ వాల్యూయేషన్ ఎగ్జామినర్‌గా నియామక ఉత్తర్వులు అందుకున్న ఆసిఫాబా ద్, మంచిర్యాల జిల్లాల ప్రభుత్వ, ప్రైవేట్ సాంఘిక సంక్షేమ, మహాత్మాజ్యోతిరావుపూలే, ఆదర్శ, కేజీబీ వీ, మైనార్టీ జూనియర్ కళాశాల అధ్యాపకులను రిలీవ్ చేసి మూల్యాంకనానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
97శాతం విద్యార్థులు హాజరు
167మంది గైర్హాజర్
ఇంటర్ పరీక్షలు ప్రశాంతం