ఉమ్మడి జిల్లాలో భూ కమతాల సగటు చూస్తే గతేడాది, తాజా సర్వే ప్రకారం యధావిధిగా ఉన్నాయి. అంటే భూమి చేతులు మారుతున్నప్పటికీ రైతుల వద్ద ఉన్న భూమి అలాగే కొనసాగుతోంది. గత ఆర్థిక సర్వేలోనూ ఉమ్మడి జిల్లాల్లో సగటు కమతం ఆదిలాబాద్ జిల్లాలో గరిష్టం 3.78ఎకరాలు ఉండగా, కనిష్టంగా మంచిర్యాలలో 2.29ఎకరాలు ఉంది. ఈ జిల్లాలో జనాభా తక్కువ, భూ లభ్యత ఎక్కువ కావడంతో సగటులో ఎక్కువ వస్తోంది.
జిల్లాలో సగటు
భూ కమతాలు (ఎకరాల్లో)
ఆదిలాబాద్ 3.78
ఆసిఫాబాద్ 1.39
నిర్మల్ 2.47
మంచిర్యాల 2.29