జన్నారం: ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టి ఇవ్వడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం మండలంలో పైలట్ గ్రామంగా ఎంపికై న కొత్తపేటలో 126 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. మండలంలోని మురిమడుగు గ్రామానికి చెందిన దుర్గం మధుమితకు రూ.4లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్(ఎల్‌ఓసీ) అందజేశారు. తహసీల్దార్ రాజమనోహర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ ఫసీఉల్లా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజాఫర్ అలీఖాన్, మండల ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం, మండల సీనియర్ నాయకులు సుభాష్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, మిక్కిలినేని రాజశేఖర్, ఇందయ్య, ఇసాక్, షాకీర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.