● సమన్వయంతో కలిసి పనిచేద్దాం.. ● పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ
మంచిర్యాలక్రైం: విధుల్లో నిర్లక్ష్యం వహించొద్ద ని, అందరం కలిసి సమన్వయంతో పని చేద్దామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ అన్నారు. రామగుండం కమిషనరేట్‌లో బుధవారం పోలీస్ అధికారులు, సిబ్బందితో పోలీస్ దర్బార్ నిర్వహించారు. సమస్యలు, విధి నిర్వహణలో ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ రెండు నెలలకు ఒకసారి వైద్య శిబిరం నిర్వహించి అధికారులు, కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్‌ఐలు దామోదర్, వామనమూర్తి, సంపత్, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.