పుష్కరమైనా పూర్తి కాని బ్రిడ్జి | - | Sakshi
Sakshi News home page

పుష్కరమైనా పూర్తి కాని బ్రిడ్జి

Mar 20 2025 1:42 AM | Updated on Mar 20 2025 1:40 AM

రామకృష్ణాపూర్‌: రామకృష్ణాపూర్‌ ప్రజలు రైల్వేగేటు కారణంగా పన్నెండేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా మరో పది రోజులు గేటు తెరుచుకోదేనే విషయం తెలిసి ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. అటు రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడం, రైల్వేగేటు సమస్యలతో సతమతం అవుతూ అవాంతరాల మధ్య కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఇబ్బందులు పడాల్సి వస్తోందనే విమర్శలు వస్తున్నాయి. క్యాతనపల్లి మున్సిపాల్టీలోని రామకృష్ణాపూర్‌ పట్టణం నుంచి మంచిర్యాల వెళ్లే ప్రధాన రహదారిలో రైల్వేగేటు ఈ నెల 19నుంచి 28వరకు మూసి వేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ ప్రధాన రైల్వే మార్గంలో ట్రాక్‌ మరమ్మతు పనుల నేపథ్యంలో ఈ గేటు మూసి వేయాల్సి వస్తోందని వెల్లడించారు. మంచిర్యాల–ఆర్కేపీ మార్గంలో రాకపోకలు సాగించే వారు పది రోజులపాటు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయ మార్గంలో సరైన రోడ్డు లేకపోవడం, పైగా దూరభారం కూడా పెరుగుతుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆయా పనులపై మంచిర్యాలకు వెళ్లేవారు, ముఖ్యంగా అత్యవసర వైద్యం కోసం వెళ్లే వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది.

నత్తనడకన పనులు

క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద ఫ్‌లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రామకృష్ణాపూర్‌ పట్టణం నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రానికి వెళ్లే మార్గంలో రైల్వే గేటు ఉన్న దృష్ట్యా ఇక్కడ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి 2013లోనే అప్పటి పెద్దపెల్లి ఎంపీ గడ్డం వివేక్‌వెంకటస్వామి నిధులు మంజూరు చేయించారు. రూ.33 కోట్ల వ్య యంతో పనులు ప్రారంభించారు. రైల్వేలైన్‌పై బ్రిడ్జి పనులను రైల్వే శాఖ అప్పట్లోనే పూర్తి చేయించగా ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలోని బ్రిడ్జి పనులు ఇంకా నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. బ్రిడ్జి కోసం నిధులు మంజూరు చేయించిన అప్పటి ఎంపీ, ప్ర స్తుత చెన్నూర్‌ ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి పనులు పూర్తి చేయించేందుకు పలుమార్లు స్వయంగా ప ర్యవేక్షించారు. అయినా ఫలితం లేదు. బ్రిడ్జి నిర్మా ణం పూర్తి చేయడంలో కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి కొన్ని వాహనా లు, మరికొంతమందితో పనులు చేయించడం, త ర్వాత మళ్లీ అదే నిర్లక్ష్యం కనబరుస్తుండడం కాంట్రా క్టర్‌కు అలవాటైందని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. రైల్వేగేటు పదే పదే పడడం వల్ల ఒక్కోసారి 30 నిమిషాల వరకు నిరీక్షించాల్సిన దుస్థితి రా వడం ఒక సమస్య అయితే ఇప్పుడు ఏకంగా పది రోజులపాటు గేటు పూర్తిగా మూసివేస్తుండడం మ రో పెద్ద సమస్యగా మారింది. ఏదేమైనా ప్రజల ఇ బ్బందుల దృష్ట్యా బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతి న పూర్తి చేయించేలా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ప్ర త్యేక చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.

కొనసా..గుతున్న వంతెన పనులు

మళ్లీ మంచిర్యాల–ఆర్కేపీ రాకపోకలు బంద్‌

తరచూ మరమ్మతులతో ఇబ్బందులు

పుష్కరమైనా పూర్తి కాని బ్రిడ్జి1
1/1

పుష్కరమైనా పూర్తి కాని బ్రిడ్జి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement