22న ట్రిపుల్‌ ఐటీలో ఎస్‌డీజీ సమ్మిట్‌ | - | Sakshi
Sakshi News home page

22న ట్రిపుల్‌ ఐటీలో ఎస్‌డీజీ సమ్మిట్‌

Mar 19 2025 12:50 AM | Updated on Mar 19 2025 12:47 AM

బాసర: నిర్మల్‌ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీ (ట్రిపుల్‌ ఐటీ)లో ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా ఈనెల 22న ఎస్‌డీజీ సమ్మిట్‌ నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ తెలిపారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు, కార్యాచరణ పరిష్కారాలను పెంపొందించడం లక్ష్యంగా ఈ సమ్మిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వర్సిటీ విద్యార్థి జావేద్‌ నేతృత్వంలోని టీమ్‌ ట్రాన్స్‌ఫార్మ్‌ ఈ సమ్మిట్‌ నిర్వహిస్తుందన్నారు. ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి సహకార చర్య, వినూత్న పరిష్కారాల ప్రాముఖ్యతను ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ నొక్కి చెప్పారు. ఈ సమ్మిట్‌ థీమ్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల జీవితాల్లో అర్థవంతమైన మార్పు తీసుకురావడానికి సంస్థ నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. అనంతరం సమ్మిట్‌ లోగో ను విడుదల చేశారు. ఓఎస్డీ ప్రొఫెసర్‌ మురళీ దర్శన్‌, ఏవో రణధీర్‌ సాగి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement