● ఎస్సీ, ఎస్టీ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజన్న
జన్నారం: ఉద్యోగులకు రిటైర్మెంట్ తప్పదని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజ న్న అన్నారు. మండల కేంద్రంలోని జ్యోతి గార్డెన్‌లో బాదంపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కామేర రాజేశ్వర్–పద్మావతి ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజన్న హాజరై రాజేశ్వర్ దంపతులను సన్మానించారు. ఉద్యోగ విరమణ అనంతరం రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల పరస్పర బదిలీ ఉత్తర్వులు విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్, ఎస్సీ, ఎస్టీ టీ యూ రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్ వెంకటరావు, ప్రముఖ కవులు మురుమడుగుల రాజారావు, రాజేశ్వర్, ఎస్సీ ఎస్టీ టీఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు బూక్య రాజేశ్‌నాయక్, పిట్ట మండల అధ్యక్షుడు తుంగూరు గోపాల్, జిల్లా, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ప్రకాశ్‌నాయక్, రాజారావు, ఎంఈవో విజయ్‌కుమార్, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు కట్ట రాజమమౌళి పాల్గొన్నారు.