ఇచ్చోడ: జిల్లాలోని ముఖరా(కె) పంచాయతీ మరో పురస్కారానికి ఎంపికై ంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు విభాగాల్లో సేవలందిస్తున్న పంచా యతీలను విషెస్ పురస్కార్ అవార్డులకు ఎంపి క చేయగా, ఇందులో ముఖరా(కె)కు చోటు దక్కింది. ఈ మేరకు సర్పంచ్ గాడ్గే మీ నాక్షి శుక్రవారం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీ ఆడిటోరియంలో అవార్డు అందుకోనున్నారు. విషెస్ పురస్కార్ అవా ర్డు దక్కడం గర్వంగా ఉందని మీనాక్షి ‘సాక్షి’కి తెలిపారు.
ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు వన్‌టైం చాన్స్
భైంసా(ముధోల్): బాసర ఆర్జీయూకేటీలో నిర్ణీత వ్యవధిలో కోర్సు పూర్తి చేయలేని విద్యార్థులకు వన్‌టైం చాన్స్ కింద పరీక్షలకు అవకాశం కల్పించనున్నట్లు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణ యం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. వి ద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా 2008 నుంచి 2014 వరకు ప్రవేశం పొందిన విద్యార్థులు పూర్తి సమ యం బీటెక్ ప్రోగ్రామ్ చదివి ఉండి ఉత్తీర్ణత సాధించని వారు ఇందుకు అర్హులన్నారు. ఏప్రిల్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.10వేలు, ఒక పేపర్‌కు రూ.3 వేల చొ ప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. డైరెక్టర్ ఆర్జీ యూ ఐఐఐటీ పేరు మీద డీడీ తీయాలని, మ రిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈవో డాక్టర్ వినోద్, అడిషనల్ సీఈవోలు సునీల్‌కుమార్, రామరాజు పాల్గొన్నారు.