
కర్ణమామిడిలో సామూహిక శ్రీమంతాలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): చిరుధాన్యాలతో లభించే పోషకాలపై విద్యార్థినులు, మహిళలకు ని రంతరం అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ సూచించారు. బుధవారం హాజీ పూర్ మండలం కర్ణమామిడి కస్తూరిభా గాంధీ బా లికల విద్యాలయంలో పోషణ పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిషోరబాలికలు, మహిళల్లో హెచ్‌బీ శాతాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రక్తహీతనకు గురికాకుండా పౌష్టికాహారం తీసుకునేలా సూచనలు చేయాలని అ న్నారు. చిరుధాన్యాల స్టాల్స్, సబ్బుతో చేతులు క డుక్కునే అంశాన్ని పరిశీలించారు. సర్పంచ్ కొట్టె మహేందర్, జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య, యూ నిసెఫ్ డైరెక్టర్ శివాల్కర్, డీఎల్‌పీఓ ప్రభాకర్‌రావు, సీడీపీఓలు స్వరూపారాణి, రేష్మా, నోడల్ అధికారి హేమసత్య, కేజీబీవీ స్పెషల్ అధికారి ఏ.స్వప్న, పోషన్ అభియాన్ కో ఆర్డినేటర్ రజిత, డీపీఎం శ్యామల, గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలు పాల్గొన్నారు.