
మాట్లాడుతున్న కలెక్టర్ బాదావత్ సంతోష్
పాతమంచిర్యాల: ప్రభుత్వం చేపట్టిన మన ఊరు–మన బడి, మన బస్తీ–మన బడి కార్యక్రమాల్లో మొదటి విడత పాఠశాలల్లో చేపట్టిన పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. కలెక్టర్ చాంబర్‌లో బుధవారం ఆయన జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్, ట్రెయినీ కలెక్టర్ గౌతమి, విద్యాశాఖ, ఏజెన్సీ అధికారులతో కలిసి పాఠశాలల అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇంకా పనులు పూర్తి కాని పాఠశాలలకు సంబంధించి గ్రౌండింగ్ వర్క్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఏజెన్సీ ఇంజినీర్లు, ఎంఈవోలు, సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు.