
కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సంతోష్
● త్వరలో పోడు పట్టాల పంపిణీ ● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వ సంక్షేమ, పథకాల లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించాలని రాష్ట్ర ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కంటివెలుగు, ఆరోగ్య మహిళ, పట్ట ణాల్లో డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణం, పోడు భూములు, హరితహారం, ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణ, సమీకృత జిల్లా శాఖ కార్యాలయాల స ముదాయంపై కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రిస్క్రిప్షన్ కళ్లద్దాలు లబ్ధిదారులకు ఇళ్లవద్దనే అందజేయాలని తెలిపారు. మహిళా ఆరోగ్య కేంద్రాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చే యాలని చెప్పారు. భూముల క్రమబద్ధీకరణకు ప్ర భుత్వం జారీ చేసిన జీవో 58, 59, 76, 118 ప్రక్రి య పకడ్బందీగా నిర్వహించాలని, జీవో 58కి సంబంధించి పెండింగ్ పట్టాలను మార్చి చివరి నాటికి పంపిణీ పూర్తి చేయాలని అన్నారు. డబుల్‌బెడ్రూం లబ్ధిదారుల ఎంపిక ఏప్రిల్ మొదటి వారం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పోడు పట్టాల పంపిణీ త్వరలో ప్రారంభమవుతుందని, పెండింగ్ దరఖాస్తులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ జిల్లాలో జీవో 76 కింద పెండింగ్‌లో ఉన్న 3,554 దరఖాస్తుల్లో 1,079 మంది లబ్ధిదారులకు ఈ నె లాఖరు వరకు పట్టాలు అందజేస్తామని, మిగతా 2,275 దరఖాస్తుల్లో అర్హులను గుర్తించి ఏప్రిల్ మొ దటి వారంలో అందజేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు డి.మధుసూదన్‌నాయక్, బి.రాహుల్, జిల్లా అటవీ అధికారి శివ్‌ఆశిష్‌సింగ్, ట్రైనీ కలెక్టర్ పి.గౌతమి పాల్గొన్నారు.