అమెరికా నుంచి వచ్చి నామినేషన్
బిజినేపల్లి: మండలంలోని లట్టుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా గ్రామానికి చెందిన కమతం నందినిరెడ్డి అమెరికా నుంచి సొంతూరుకు వచ్చి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలో నివసిస్తున్న నందినిరెడ్డి రెండో కుమార్తెకు ప్రసవం కావడంతో కొద్ది నెలల కిందట ఆమె విజిటింగ్ వీసాలో అక్కడి వెళ్లారు. ఇండియాకు రావడానికి మరి కొద్ది వారాల సమయం ఉండగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల కోసం నోటిపికేషన్ విడుదల చేయడం, ముగ్గురు పిల్లల నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయడం, లట్టుపల్లి గ్రామానికి జనరల్ మహిళ కేటాయించడంతో హుటాహుటిన ఆమె గ్రామానికి తిరిగి వచ్చారు. పరిస్థితులు అన్ని ఒకేసారి తనకు అనుకూలంగా రావడంతో సర్పంచ్ పీఠం కూడా దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నట్లు అభ్యర్థి నందినిరెడ్డి తెలిపారు.


