రాష్ట్రస్థాయి వాలీబాల్‌లో జిల్లా జట్ల ప్రతిభ
● చాంపియన్‌గా నిలిచిన
బాలికల జట్టు
● మూడోస్థానంలో బాలుర జట్టు
మహబూబ్‌నగర్ క్రీడలు: సిరిసిల్లలోని రాజీవ్‌నగర్ మినీ స్టేడియంలో మంగళవారం ముగిసిన రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లా సబ్ జూనియర్ వాలీబాల్ టోర్నమెంట్‌లో జిల్లా బాలికల జట్టు చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. చివరి పోరులో మహబూబ్‌నగర్ బాలికల జట్టు వరంగల్ జట్టుపై 25–19, 25–14, 25–23, 25–21 సెట్ల తేడాతో విజయం సాధించింది. అదేవిధంగా బాలుర విభాగంలో జిల్లా జట్టు మూడోస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.శాంతికుమార్, మహ్మద్ హనీఫ్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చెన్నవీరయ్య, దస్తగీర్‌ఖాన్, కోచ్ పర్వేజ్‌పాషా క్రీడాకారులను అభినందనలు తెలపడంతో పాటు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


