చెక్‌పోస్టులో రూ.2.64 లక్షల నగదు పట్టివేత
గోపాల్‌పేట: మండలంలోని బుద్దారం గండి చెక్‌పోస్టు వద్ద మంగళవారం పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. చెక్‌పోస్టు వద్ద సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా అచ్చంపేట నుంచి పెబ్బేరుకు వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి కొంత నగదు, బిజ్ఞాపల్లి నుంచి ఇద్దరు వ్యక్తులు వనపర్తి జిల్లాలోకి డబ్బును తరలిస్తుండగా కొంత మేర మొత్తం రూ.2.64 లక్షలు పట్టుకున్నట్లు ఎస్‌ఐ నరేష్‌కుమార్ తెలిపారు. పట్టుకున్న డబ్బులను ఎన్నికల నియమావళి మేరకు కలెక్టర్ కార్యాలయంలో అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
చెక్‌పోస్టును తనిఖీ చేసిన ఎస్పీ
మండలంలోని బుద్దారం గండి చెక్‌పోస్టును ఎస్పీ సునీతరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెక్‌పోస్టు వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. తనిఖీ వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు వెల్లడించాలన్నారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


