కొనసాగుతున్న నీటి పంపింగ్
ధరూరు: జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిధిలోని నెట్టెంపాడు ఎత్తిపోతల లిఫ్టు–1 గుడ్డెందొడ్డి పంప్‌హౌస్ వద్ద నీటి పంపింగ్‌ను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి 7.30 గంటల వరకు ప్రాజెక్టుకు 1,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఆవిరి రూపంలో 48 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు, హీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 390 క్యూసెక్కులు, కుడి కాల్వకు 3910 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 2,229 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 9.542 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
7,220 క్యూసెక్కుల నీటి తరలింపు
దోమలపెంట: భూగర్భ కేంద్రంలో పంప్‌మోడ్ పద్ధతిలో శ్రీశైలం ఆనకట్ట దిగువున సాగర్ జలాశయం నుంచి ఇరవై నాలుగు గంటల వ్యవధిలో 7,220 క్యూసెక్కుల నీటిని (ఎత్తిపోతల) తరలించారు. విద్యుత్ డిమాండ్ పీక్ అవర్స్ ఉదయం 5.30 గంటల నుంచి 8.30 గంటల సమయంలో భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. తర్వాత నుంచి సోలార్ విద్యుత్ అందుబాటులోకి రావడం వలన రాష్ట్రంలో విద్యుదుత్పత్తి అధికమవుతుంది. దీంతో మిగులు విద్యుత్‌ను వినియోగించుకుని భూగర్భ కేంద్రంలో ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పంప్‌మోడ్ పద్ధతిలో సాగర్ జలాశయం నుంచి శ్రీశైలం జలాశయంలోకి నీటిని తరలిస్తున్నారు. సాయంత్రం పీక్ హవర్స్‌లో విద్యుత్ అవసరమైనప్పుడు కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్నారు. మంగళవారం శ్రీశైలం జలాశయంలో 882.2 అడుగులు వద్ద 200.1971 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
భూగర్భ కేంద్రం


