
అలంపూర్ ఆలయాల్లో..
అలంపూర్: అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజుతో పాటు తొలి ఏకాదశి కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి దర్శనానికి క్యూలైన్‌లో బారులు తీరారు. జోగుళాంబ ఆలయంలో కుంకుమార్చన, అభిషేక పూజలు అనంతరం బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో అభిషేకాలు, అర్చనలు జరిపించారు. ఈఓ పురేందర్ కుమార్, సిబ్బంది భక్తులకు తాగునీటి వసతితో పాటు అన్నదాన సత్రంలో అన్నప్రసాదం అందించే ఏర్పాట్లు చేశారు. వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు చేపట్టారు.

అలంపూర్ ఆలయాల్లో..