
ఎన్‌సీడీ పరీక్షల్లో..
జిల్లాలో 30 ఏళ్లు పైబడిన వారికి ఎన్‌సీడీ (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్– అసంక్రమిత వ్యాధుల) నిర్ధారణ పరీక్షలు మూడు దశల్లో పూర్తి చేయగా ఇందులో దీర్ఘకాలిక రోగులు అధికంగా బయటపడుతున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. జిల్లాలోని 129 సబ్ సెంటర్లు, 17 పీహెచ్‌సీలు, ఆరు అర్బన్ హెల్త్ సెంటర్లు, మూడు ఎన్‌సీడీ క్లినిక్‌ల పరిధిలో ఉన్న ఏఎన్‌ఎం, సెకెండ్ ఏఎన్‌ఎం కలిసి బీపీ, షుగర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత బీపీ, షుగర్ ఉన్నట్లు నిర్ధారణ అయితే మళ్లీ సదరు పీహెచ్‌సీ, లేదా సబ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.