
చైర్మన్ వర్సెస్ వైస్ చైర్మన్
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు పాలక మండలి, అధికారుల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో మొదటి నుంచి వివాదాలకు దారి తీస్తుంది. మార్కెట్ కమిటీ పాలక మండలి నియామకం విషయంలో ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు చైర్మన్ పదవికి పోటీ పడ్డారు. కాగా.. బీసీ సామాజిక వర్గం నుంచి ముదిరాజ్ కులానికి చెందిన పెద్ద విజయ్‌కుమార్ చైర్మన్ పదవిని ఆశించగా.. రాజకీయ సమీకరణలో భాగంగా చైర్మన్ పదవి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బెక్కరి అనితకు దక్కింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన వైస్ చైర్మన్ పెద్ద విజయ్‌కుమార్ అధికారులు, చైర్మన్‌పై గుర్రుగా ఉన్నారు. యాసంగి సీజన్‌లో మార్కెట్ యార్డుకు రైతులు తీసుకువచ్చిన వరిధాన్యం కొనుగోలు, మద్దతు ధర వ్యవహారంలో రైతులు ఆందోళనకు దిగారు. దీని వెనుక వైస్ చైర్మన్ హస్తం ఉందని అధికార పార్టీ నాయకులతోపాటు చైర్మన్ కూడా అప్పట్లో అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా బుధవారం లైసెన్స్ హమాలీలకు దుస్తుల పంపిణీ వ్యవహారంలో మరోసారి రగడ చోటు చేసుకుంది. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి జోక్యం చేసుకుని మార్కెట్ యార్డు పాలక మండలి అభాసుపాలు కాకుండా, రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని, చైర్మన్, వైస్ చైర్మన్ల మధ్య వివాదాలు జరగకుండా ఎమ్మెల్యే సర్ది చెప్పాలని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు.
మహబూబ్‌నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో తీవ్రమైన వివాదాలు
చర్చనీయాంశమైన కార్యదర్శిౖపైవెస్ చైర్మన్ దాడి వ్యవహారం