
ఫర్టిలైజర్స్ దుకాణాల తనిఖీ
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): జిల్లాకేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను బుధవారం అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాలను సందర్శించిన ఆయన యూరియా అమ్మకాల గురించి తెలుసుకున్నారు. పీఓఎస్ మిషన్, స్టాక్ రిజిష్టర్లు, రైతు వారీగా యూరియా అమ్మకాల రిజిష్టర్లను పరిశీలించారు. వానాకాలం సీజన్ ప్రారంభమైన దృష్ట్యా రైతులకు యూరియా కొరత రానివ్వకుండా చూసుకోవాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ వెంట డీఏఓ వెంకటేష్, ఏడీఏ శ్రీనివాసులు తదితరులున్నారు.