
అధికారులు స్పందించాలి..
రెండు నెలలుగా జీతా లు అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఎంఆర్‌ఐ సంస్థ టెండర్ ప్రకారం ప్రతి నెల జీతాలు ఇవ్వాల్సి ఉంది. కానీ, రెండు నెలల జీతాలు రాని విషయమై ఉన్నతాధికారులు సకాలంలో స్పందించి సిబ్బందికి జీతాలు ఇప్పించాలి. వేతనాలు రాకపోవడంతో కుటుంబాలు గడవటం చాలా కష్టంగా ఉంది.
– మాసన్న, 108 పైలెట్, మహబూబ్‌నగర్
రెండు, మూడురోజుల్లో..
ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న 108, 102 సిబ్బందికి రెండు నెలలకు సంబంధించిన జీతాలు రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి మరో రెండు, మూడు రోజుల్లో జీతాలు చెల్లించే అవకాశం ఉంది. నాలుగు స్లాబ్‌ల ప్రకారం సీనియర్, జూనియర్ సిబ్బందికి జీతాలు ఉంటాయి. – రవికుమార్,
ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్
●