
చాలా చోట్ల దెబ్బతిన్నాయి..
నగరంలోని చెరువులు, కుంటలకున్న పాటుకాల్వలు, పెద్ద నాలాలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. వీటిని ఆనుకొని దశాబ్దాల క్రితమే కొందరు ఇళ్లు నిర్మించుకోవడంతో ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎర్రకుంటకు సంబంధించి వీరన్నపేట గుట్టల వద్ద జాయమ్మచెరువు, ఈర్లకుంటల నుంచి కుమ్మరివాడి, కురిహినిశెట్టికాలనీ మీదుగా పాటుకాల్వ వస్తుంది. ఇది మధ్యలో ఎక్కడబడితే అక్కడ ధ్వంసమైంది. వెంటనే పటిష్టం చేసి వరద సాఫీగా ముందుకు వెళ్లేలా చూడాలి.
– శాంతయ్యయాదవ్, బండ్లగేరి, మహబూబ్‌నగర్
బాగు చేస్తాం..
అమృత్–2 పథకం కింద నగర పరిధిలో మూడు చోట్ల ఎస్‌టీపీలు నిర్మించనున్నాం. ఇందులో భాగంగా ఆయా చెరువులు, కుంటలకున్న పాటుకాల్వలు, పెద్దనాలాలు పటిష్టం చేస్తాం. వీటి కోసం సుమారు రూ.40 కోట్లు వెచ్చించనున్నాం. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాం. – విజయభాస్కర్‌రెడ్డి,
ఈఈ, పబ్లిక్ హెల్త్– మున్సిపల్ ఇంజినీరింగ్, మహబూబ్‌నగర్

చాలా చోట్ల దెబ్బతిన్నాయి..