● నగర పరిధిలోకుచించుకుపోయిన పెద్ద నాలాలు, కాల్వలు
● పట్టణాన్ని ముంచెత్తుతున్న పెద్దచెరువు, ఎర్రకుంట,గాండ్లోనిచెరువు, చిక్కుడువాగు వరద నీరు
● పట్టించుకోని నీటిపారుదల, మున్సిపల్ అధికారులు
● ఏటా వర్షాకాలంలో భయం గుప్పిట్లో లోతట్టు ప్రాంతవాసులు
● తాత్కాలిక చర్యలతోనే సరిపెడుతున్న అధికార యంత్రాంగం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు నగర పరిధిలోని పెద్దచెరువు, ఎర్రకుంట, గాండ్లోనిచెరువు, చిక్కుడువాగుకున్న పాటుకాల్వలు, పెద్దనాలాలు అధ్వాన స్థితికి చేరుకున్నాయి. వీటికి ఆనుకుని ఇరువైపులా యథేచ్ఛగా కొందరు ఇళ్లు నిర్మించుకోవడంతో కుచించుకుపోయాయి. దీంతో కొన్నిచోట్ల వాటి ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. అసలే వర్షాకాలం.. ఆపై వరద వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లన్నీ జలమయమై కుంటలను తలపిస్తోంది. పెద్దచెరువు శివారులో నలువైపులా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పీర్లబావి, అంబేడ్కర్ నగర్, బీకేరెడ్డి కాలనీ, నాగిరెడ్డి కాలనీ, మర్లులోని ఎస్‌ఆర్ నగర్, రామయ్యబౌలి, శివశక్తి నగర్, బాలాజీ నగర్‌లో ముంపు పొంచి ఉంది. అలాగే ఎర్రకుంటకు అటు, ఇటువైపు ఉన్న కురిహినిశెట్టి కాలనీ, బండ్లగేరి, కిసాన్ నగర్, గణేష్ నగర్, వల్లభ్ నగర్, గౌడ్స్‌కాలనీ, గచ్చిబౌలి, గోల్‌మసీదు పరిసర ప్రాంతాలు జలమయమవుతున్నాయి. అయినప్పటికీ మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారులు తాత్కాలిక చర్యలు చేపడుతుండటంతో సమస్యలు శాశ్వత పరిష్కారానికి నోచుకోవడం లేదు.
కబ్జాల్లో పాటుకాల్వలు
కబ్జాల్లో పాటుకాల్వలు