అదనపు కలెక్టర్‌గా మధుసూదన్‌నాయక్‌ | - | Sakshi
Sakshi News home page

అదనపు కలెక్టర్‌గా మధుసూదన్‌నాయక్‌

Jul 2 2025 6:53 AM | Updated on Jul 2 2025 7:24 AM

అదనపు

అదనపు కలెక్టర్‌గా మధుసూదన్‌నాయక్‌

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): అదనపు (రెవెన్యూ) కలెక్టర్‌గా మధుసూదన్‌నాయక్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో స్పెషల్‌ కలెక్టర్‌ (భూ సేకరణ)గా పనిచేస్తున్న మధుసూదన్‌నాయక్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అలాగే కలెక్టరేట్‌ పరిపాలన అధికారిగా డీ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ జె.సువర్ణరాజ్‌ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఏఓగా ఉన్న శంకర్‌ పదవీ విరమణ పొందిన విషయం తెలిసిందే. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే కలెక్టరేట్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్లు, సిబ్బందితో సమావేశం నిర్వహించి పెండింగ్‌ ఫైళ్ల వివరాలను విభాగాల వారీగా సమీక్షించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.

ఇరిగేషన్‌ సీఈగా

చక్రధరం

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ఇరిగేషన్‌ శాఖ జిల్లా సీఈగా చక్రధరం నియమితులయ్యారు. సీఈగా ఉన్న బద్దం వెంకటరమణారెడ్డి పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో ఇరిగేషన్‌ సర్కిల్‌–1 ఎస్‌ఈగా ఉన్న చక్రధరంను పూర్తిస్థాయి సీఈగా నియమించారు. ఈ మేరకు ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు సమయపాలన పాటించాలని, ఉద్యోగ ధర్మం గుర్తెరిగి విధులు నిర్వర్తించాలని సూచించారు. టీఎన్‌జీఓ జిల్లా కార్యదర్శి చంద్రనాయక్‌, తెలంగాణ ఇరిగేషన్‌ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దామోదర్‌ తదితరులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఇరిగేషన్‌ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి నర్మద, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్‌, రాష్ట్ర క్యాదర్శి వెంకట్‌రెడ్డి, డీఈలు మధు, మురళిధర్‌గౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, కృష్ణ, అభూఖాన్‌సిద్ధిఖీ, బాలనరహరి తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌గా మధుసూదన్‌నాయక్‌ 
1
1/1

అదనపు కలెక్టర్‌గా మధుసూదన్‌నాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement