
ముంపు ముప్పు తప్పేనా..?
●
దుకాణంలోకి వస్తున్నాయి..
పెద్ద వర్షం పడిందంటే చాలు ప్రధాన రోడ్డుపైకి నీళ్లు వచ్చి మా దుకాణం మొత్తం నిండిపోతుంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. నల్లకుంట నుంచి వచ్చే కాల్వ సాఫీగా రాకుండా మలుపు ఉండటంతో నీళ్లన్నీ రోడ్డుపైకి వచ్చి మా దుకాణాల్లోకి వస్తున్నాయి. అలాగే రోడ్డుకు ఇరువైపులా పెద్ద కాల్వలు నిర్మిస్తేనే సమస్య తీరుతుంది.
– వెంకటయ్య, బాదేపల్లి
వర్షం వచ్చిందంటే..
వర్షం వచ్చిందంటే చాలు భయం వేస్తుంది. రోడ్డుపైకి నీళ్లు చేరి మా దుకాణం మొత్తం నిండిపోతుంది. రాత్రిళ్లు అయితే చాలా ఇబ్బందిగా ఉంటది. వర్షం తగ్గాక దుకాణం శుభ్రం చేసుకునేందుకు తిప్పలవుతుంది. దుర్వాసన భరించలేక రెండు మూడు రోజులు ఒక రకంగా ఉంటాం. నీళ్లు రోడ్డుపైకి రాకుండా చర్యలు తీసుకోవాలి.
– అస్లాం, బాదేపల్లి
కాల్వ కట్ చేయడంతో..
వీరశివాజీనగర్‌లో పెద్దకాల్వను కట్ చేసి నిర్మాణం చేయకుండా వదిలేయడంతో వరద నీరు రోడ్డుపై పారుతూ ఇళ్లలోకి వస్తున్నాయి. చిన్నపాటి వర్షం పడినా ఆ రోజంతా ఇబ్బందే. ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాం. కట్ చేసిన కాల్వను సరిచేయడంతో పాటు పైనుంచి వచ్చే వరద సాఫీగా వెళ్లేలా పెద్ద కాల్వ నిర్మించాలి.
– సంతోష్‌చారి, వీరశివాజినగర్
ఈఎన్‌సీలో జాప్యం..
మున్సిపాలిటీలో వరద నీటిని ఎదుర్కొనేందుకు టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా నిధులు మంజూరయ్యాయి. దీని ద్వారా మొత్తం 10 పెద్ద కాల్వలు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అయితే సింగిల్ టెండరు రావడం వల్లే ఈఎన్‌సీలో జాప్యం అవుతుంది. టెండరు వేసిన సంస్థ గురించి పూర్తిగా తెలుసుకున్నాకే పనులు అప్పగిస్తారు. వచ్చే ఏడాదికి ముంపు నుంచి పూర్తిగా బయటపడతాం.
– లక్ష్మారెడ్డి, మున్సిపల్ కమిషనర్, జడ్చర్ల
జడ్చర్ల టౌన్: వర్షాకాలం వచ్చిందంటే చాలు జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రోడ్లతో పాటు కాలనీలు జలమయమవుతున్నాయి. పాలకులకు ముందుచూపు లేకపోవడం, పాటు కాల్వలు, కల్వర్టులు కబ్జా చేయటంతో పాటు నల్లకుంటను తీసివేయడంతో ప్రతి ఏటా వానాకాలంలో పట్టణ ప్రజలు, వాహనదారులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ముంపును నివారించేందుకు గానూ టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా రూ.14 కోట్లు విడుదలైనా ఏడాదికాలంగా టెండరు ప్రక్రియలోనే మగ్గుతోంది.
పది కాల్వల నిర్మాణం..
మున్సిపాలిటీలో వరద ముంపును నివారించేందుకు టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా రూ.14 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో మొత్తం 10 కాల్వలు నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించి.. టెండర్ ప్రక్రియ ప్రారంభించారు. అయితే సింగిల్ టెండర్ మాత్రమే రావడంతో ఈఎన్‌సీ అధికారులు పెండింగ్‌లో పెట్టారు. టెండర్ వేసిన సంస్థ గురించి క్షుణ్ణంగా అధ్యయనం కోసం ఎవాల్యుషన్ చేస్తున్నారు. దీంతో ఏడాదిగా పనులు కేటాయించకుండా జాప్యం చేస్తున్నారు. టెండర్ ప్రక్రియ పూర్తిచేసి కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించినా వర్షాకాలంలో మొదలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రస్తుత వర్షాకాలంలో మున్సిపాలిటీ వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు.
జడ్చర్ల మున్సిపాలిటీలో కనిపించని వరద నివారణ చర్యలు
చిన్నపాటి వర్షాలకే జలమయమవుతున్న పట్టణం
టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా రూ.14 కోట్లు మంజూరైనా టెండర్ ప్రక్రియలోనే
పాటు కాల్వలు, కల్వర్టుల కబ్జాతోనే ప్రమాద ఘంటికలు
ఈ వర్షాకాలంలోనూ తిప్పలు తప్పవంటున్న పట్టణవాసులు

ముంపు ముప్పు తప్పేనా..?

ముంపు ముప్పు తప్పేనా..?

ముంపు ముప్పు తప్పేనా..?

ముంపు ముప్పు తప్పేనా..?

ముంపు ముప్పు తప్పేనా..?

ముంపు ముప్పు తప్పేనా..?