
రాష్ట్రస్థాయిలో విజేతగా నిలవాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ టోర్నీలో జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్‌పీ వెంకటేశ్ అన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లో ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి బాలికల జూనియర్ ఫుట్‌బాల్ టోర్నీలో పాల్గొనే జిల్లా జట్టు ఎంపికలను మంగళవారం జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారిణులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ ఫుట్‌బాల్‌లో జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నిరంతర ప్రాక్టిస్ చేయడం వల్ల క్రీడల్లో ఉన్నతస్థానాల్లో చేరుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్యాట్రన్ రంగారావు, ఉపాధ్యక్షులు రమేష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి భానుకిరణ్, కోశాధికారి కేఎస్.నాగేశ్వర్, కార్యనిర్వాహక కార్యదర్శి ఇమ్మాన్యుయెల్ జేమ్స్, కోచ్ వెంకట్రాములు, ఖేలో ఇండియా ఫుట్‌బాల్ కోచ్ నికేష్ పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం
అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్