
చిరుత సంచారంతో కలకలం!
మహబూబ్‌నగర్ న్యూటౌన్: జిల్లాకేంద్రం పరిధిలోని వీరన్నపేట హెచ్‌ఎన్ ఫంక్షన్ హాలు సమీపంలోని గుట్టలో బండరాయిపై చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గుట్ట మీద ఉన్న బండరాయిపై సంచరిస్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ మహ్మద్ కమాలుద్దీన్ పర్యవేక్షణలో 8 మంది ఫారెస్టు అధికారులు, సిబ్బంది బృందం చిరుత తిరిగిన, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. చిరుత సంచారం ఆనవాళ్లు కనిపించలేదు. మూడు రోజుల క్రితం చిన్నదర్పల్లి అటవీ ప్రాంతానికి సమీపంలో పంట పొలాల వద్ద రాత్రి వేళలో ఆవుదూడపై దాడి చేసినట్లు గ్రామ రైతులు పేర్కొంటున్నారు. ఈ ఘటనతో చిరుతలు సంచరిస్తున్న విషయానికి బలం చేకూరుతోంది.
భయాందోళనతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం
8 మంది అధికారుల బృందం పరిశీలన