
పులులకు ఏకాంతం కల్పించేందుకు..
పులులకు ఏకాంత వాతావరణాన్ని కల్పించేందుకు అడవిలోకి ప్రవేశించకుండా పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నాం. ఇందుకు ప్రజలు, యాత్రికులు సహకరించాలి. అనుమతులు లేకుండా అడవిలోకి ప్రవేశించడంపై ఆంక్షలు నిరంతరం కొనసాగే ప్రక్రియ. జూలై నుంచి సెప్టెంబర్ వరకు పెద్దపులి జతకట్టే రోజులు కావడంతో మూడు నెలలపాటు యాత్రికులను అనుమతించడం లేదు. పర్హాబాద్ వ్యూ పాయింట్ సఫారీ సేవలు నిలిపివేశాం. ప్రధాన రహదారి గుండా వాహనదారులు 30కిలోమీటర్ల వేగం మించకుండా వెళ్లాలి.
– రోహిత్‌గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి