
రెండు బైక్‌లు ఢీ : యువకుడి దుర్మరణం
అయిజ: రెండు బైక్‌లు ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాసరావు కథనం మేరకు.. మేడికొండకు చెందిన చరణ్ (26) ఆదివారం పట్టణం నుంచి స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. అదే సమయంలో పుర పరిధిలోని తుపత్రాలకు చెందిన రమేష్ బైక్‌పై అయిజకు వస్తుండగా తుపత్రాల సమీపంలో రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చరణ్‌కు గాయాలుకాగా అంబులెన్స్‌లో గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి.. మెరుగైన చికిత్స కోసం అర్ధరాత్రి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతదేహానికి అక్కడే పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వెల్దండ: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన సంఘటన సోమవారం కర్నూల్ జిల్లాలోని నంద్యాల–శ్రీశైలం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. వెల్దండ మండల కేంద్రానికి చెందిన బచ్చు రాఘవేందర్(34) కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ప్రైవేట్ హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీలో పాలసీ ఏజెంటుగా పనిచేస్తున్నాడు. నంద్యాలలో ఉంటున్న స్నేహితుడి వద్దకు తల్లి పద్మమ్మతో కలిసి వెళ్లాడు. తల్లిని స్నేహితుడి కుటుంబ సభ్యుల వద్ద ఉంచి రాఘవేందర్, స్నేహితుడు కారులో శ్రీశైలం వెళ్లారు. మార్గంమధ్యలో కారు నిలిపి సోమవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో కాలకృత్యాల కోసం రోడ్డు దాటుతుండగా నంద్యాల–శ్రీశైలం జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో రాఘవేందర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ విషయం తెలుసుకున్న వెల్దండలోని బంధువులు, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లారు. రాఘవేందర్ మృతి చెందడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అములుకున్నాయి. అతనికి తల్లిదండ్రులు పద్మ, సత్యనారాయణ, అక్క రాజేశ్వరి ఉన్నారు.

రెండు బైక్‌లు ఢీ : యువకుడి దుర్మరణం