
భూగర్భ కేంద్రం సీఈగా కేవీవీ సత్యనారాయణ
దోమలపెంట: టీఎస్‌జెన్‌కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజినీర్‌గా కేవీవీ సత్యనారాయణ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన విద్యుత్ సౌధ, హైదరాబాద్‌లో ఎస్‌ఈ, జనరేషన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రమోషన్లు ఇవ్వొద్దని కోర్టులో స్టే ఉండడం వల్ల ఇన్‌చార్జి సీఈగా భూగర్భ కేంద్రానికి వచ్చారు. ఆయన జెన్‌కోలో సీనియర్ కావడంతో జెన్‌కో యాజమాన్యం ఈ బాధ్యతలు అప్పగించారు. ఈసందర్భంగా ఆయనకు భూ గర్భ కేంద్రం ఇంజినీర్లు ఘనంగా స్వాగతం పలికారు. ఇప్పటి వరకు కేంద్రం సీఈగా విధులు నిర్వహించిన కె.రామసుబ్బారెడ్డి పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కేంద్రం ఇంజినీర్లు, ఉద్యోగులు రామసుబ్బారెడ్డి సేవలను కొనియాడి ఘనంగా వీడ్కోలు పలికారు.