కన్న కొడుకులు గెంటేశారు.. ఆదుకోండి సారూ...! | - | Sakshi
Sakshi News home page

కన్న కొడుకులు గెంటేశారు.. ఆదుకోండి సారూ...!

Jul 1 2025 4:30 AM | Updated on Jul 1 2025 4:30 AM

కన్న కొడుకులు గెంటేశారు.. ఆదుకోండి సారూ...!

కన్న కొడుకులు గెంటేశారు.. ఆదుకోండి సారూ...!

‘కడుపున పుట్టిన పిల్లలు పట్టెడన్నం పెట్టకుండా ఇంటి నుంచి గెంటేశారు.. పైగా నా పేరున ఉన్న భూమిని కూడా లాక్కున్నారు’ అంటూ 70 ఏళ్ల ఓ వృద్ధురాలు సోమవారం గద్వాల కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్‌ బీఎం సంతోష్‌కు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మల్దకల్‌కు చెందిన పాపమ్మకు 4 కుమారులు. వృద్ధాప్యంలో అండగా నిలబడాల్సిన వారు ఆమె పేరిట ఉన్న 2.37 ఎకరాల భూమిని వారి పేరున రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అంతేగాకుండా కనీసం రోజు భోజనం కూడా పెట్టకుండా ఇంటి నుంచి గెంటేశారు. తనకు న్యాయం చేయాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది. – గద్వాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement